NTV Telugu Site icon

Husband Attack Wife: దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..?

Husband Tried Kill Wife

Husband Tried Kill Wife

Husband Tried To Kill Wife And Son Due To Doubt On His Wife: అనుమానం పెనుభూతం వంటిది. ఒక్కసారి ఇది అంటుకుందంటే.. దారుణ పరిణామాలకు దారి తీస్తుంది. ఓ వ్యక్తి చేత నేరాలు సైతం చేయిస్తుంది. ఇందుకు తాజా సంఘటనని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతుందేమోనన్న అనుమానంతో.. ఓ వ్యక్తి తన భార్యతో పాటు కొడుకుని సైతం దాబాపై నుంచి తోసేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. అదృష్టవశాత్తు తల్లికొడుకులు ఇద్దరు బతికి బయటపడ్డారు. కానీ.. గాయాలు తీవ్రంగా అయ్యాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనల వెనుక విదేశీ హస్తం.. సీఎం బీరెన్ సింగ్

గుంటూరు జిల్లాలో ఉషరావు అనే వ్యక్తి తన భార్య మల్లేశ్వరి, కుమారుడు భార్గవ్ సాయితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉషరావు, మల్లేశ్వరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కానీ.. కొంతకాలం నుంచి ఉషరావు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందేమోనని అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఆమెని నిత్యం వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. తనకు ఎవరితోనూ ఎఫైర్ లేదని, తనని అనుమానించొద్దని భార్య వేడుకుంది. అప్పటికీ నమ్మని భర్త.. ఒక కండీషన్ పెట్టాడు. తాను పరాయి వ్యక్తితో ఎఫైర్ నడపడం లేదని.. గుడిలో ప్రమాణం చేయాలని చెప్పాడు. అందుకు భార్య మల్లేశ్వరి ఒప్పుకుంది.

Congress: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ.. ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్ గాంధీ..!

ఈ నేపథ్యంలోనే.. భార్య, కొడుకుని తీసుకొని ఉసరావు పెనుగంచిప్రోలుకి వచ్చాడు. తన మాయమాటలతో దాబా పైకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి భార్య, కొడుకుని తోసేసి.. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లికొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు రంగంలోకి దిగి, భర్త ఉషరావుని అదుపులోకి తీసుకొని, 307గా కేసు నమోదు చేశారు.

Show comments