Site icon NTV Telugu

Humanity Fading: రాను రాను జనాల్లో సచ్చిపోతున్న మానవత్వం.. ప్రాణం పోతున్న…

Untitled Design (4)

Untitled Design (4)

రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఓ వ్యక్తి ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. అలానే చూస్తూ ఉండిపోయారు. అయితే .. గుంటూరు జిల్లా కూరగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. ట్రిప్పర్ ను ఓవర్ టేక్ చేస్తుండగా.. చక్రాల కింద పడిపోయాడు. అయితే టిప్పర్ రెండు టైర్లు అతడి తలపై నుంచి వెళ్లడంతో .. తీవ్ర గాయాలతో ప్రాణాలు ఓదిలాడు.

Read Also: Car Stuck in Flyover: ఫ్లై ఓవర్ గ్యాప్ లో ఇరుక్కున్న కారు.. రక్షించిన స్థానికులు

పూర్తి వివరాల్లోకి వెళితే.. కూరగల్లుకు చెందిన ఓ వ్యక్తి టిప్పర్ ను దాటేందుకు ప్రయత్నిస్తూ.. చక్రాల కింద పడిపోయాడు. అయితే.. తలకు తీవ్రగాయాలతో ఆ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నాడు. అయినప్పటికి అక్కడున్న వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. అతడికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో కొద్ది సేపటికి ఆ యువకుడు తీవ్ర రక్త స్తావంతో పాణాలు ఒదిలాడు.

Read Also:Fitness Exercises: గ్రామాల్లో చేసే పనులతో.. జిమ్ లో మహిళలకు ట్రైనింగ్

అయితే.. యువకుడు ప్రాణాలతో కొట్టుకుంటున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు స్థానికులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణం పోతున్నా.. ఈ సమాజం పట్టించుకోవడం లేదని.. కనీసం అంబులెన్స్ ఫోన్ చేసినా.. యువకుడు బతికేవాడంటూ.. ఆవేదన వ్యక్తం చేవారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. మృత దేహాన్నిపోస్ట్ మార్టంకు తరలించారు.

Exit mobile version