NTV Telugu Site icon

Teneti Vanitha : 2024లో కూడా జగనన్ననే సీఎం చేసుకోవాలి

Taneti Vanitha

Taneti Vanitha

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ అవిర్భవించి 12 ఏళ్ళు అయిన సందర్భంగా అన్ని నియోజకవర్గాలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నామన్నారు. దివంగత వైస్సార్ కాలం చేశాక జగనన్న కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇబ్బందులకు గురిచేసిందని, జగనన్న కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఎదిరించి మనందరికీ అండగా నిలబడ్డారని ఆమె అన్నారు. మూడేళ్ళల్లో ప్రభుత్వమే ప్రజల్లో వుందని, జగనన్న ఏపీలో చక్కని పాలన అందిస్తున్నారని ఆమె కొనియాడారు. మనరాజు జగనన్న బలవంతుడు అయినందునే ప్రతిపక్షాలు ఒక్కటవ్వాలని చూస్తున్నారన్నారు. ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, 2024లో కూడా జగనన్ననే సీఎం చేసుకోవాలని వనిత అన్నారు.