NTV Telugu Site icon

వామ్మో ఇవేం ధరలు..

పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. సామాన్యుల జేబులకు చిల్లులుపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ పై రూ.35 పైసల చొప్పున పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.92, డీజిల్‌ ధర రూ.103.91కు పెరిగింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113, డీజిల్‌ ధర రూ.105.55 గా ఉంది. సెప్టెంబర్‌ 5 తర్వాత డిజీల్‌ ధర రూ.6.85, పెట్రోల్‌ ధర రూ.5.35 కు పెరిగింది. ముడిచమురు కంపెనీల్లో ధరల వ్యతాసాల వల్ల ఆయా నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి.