Site icon NTV Telugu

MLC Duvvada Srinivas: రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు..

Duvvada

Duvvada

MLC Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కుతుంది. గత రెండేళ్లుగా కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వేరు వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య జేడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వరుసగా ఇంచార్జ్ లను వైసీపీ మార్చింది. ఎన్నికల్లో తనకి టిక్కెట్ కావాలని దువ్వాడ వాణి కోరింది. లెకపోతే భర్తపై రెబల్ గా పోటీ చేస్తానంటూ గతంలో లీకు ఇచ్చింది.. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం సర్ది చెప్పడంతో వాణి వెనక్కి తగ్గింది.

Read Also: Arshad Nadeem: ఆరంభంలో క్రికెట్‌ ఆడా.. నీరజ్‌తో పోటీ పడటం బాగుంటుంది: పాక్‌ అథ్లెట్ అర్షద్

అయితే, నిన్న రాత్రి తండ్రి దువ్వాడ శ్రీనివాస్ తమ వద్దకు రావాలంటూ దువ్వాడ కార్యాలయం ముందు ఆయన ఇద్దరు కూతుర్లు నిరసనకు దిగారు. తండ్రి ఇంటి నుంచి బయటకు రావాలంటూ ఆందోళన చేశారు. తమ తండ్రి మరో మహిళతో ఉంటూ.. తమని కావాలనే దూరం పెడుతున్నారని దువ్వాడ కుమార్తె డాక్టర్ హైందవితో పాటు ఆమె తల్లి దువ్వాడ వాణి ఆరోపించారు.


Exit mobile version