NTV Telugu Site icon

AP High Court: పోలీసులకు హైకోర్టు షాక్.. డిబేట్ ఎలా జరుగుతుందని నిలదీత

Ap High Court

Ap High Court

High Court Gives Shock To Police Over Akhila Priya Shilpa Ravi Issue: నంద్యాలకు వెళ్లకుండా భూమా అఖిల ప్రియకు నోటీసులు ఇవ్వడంపై.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పోలీసులకు షాక్ ఇచ్చింది. తొలుత అఖిల ప్రియ తరఫు న్యాయవాది తమ క్లయింట్‌కు నోటీసులిచ్చి నంద్యాలకు వెళ్లనివ్వలేదని తెలపగా.. శిల్పా రవికి నోటీసులు ఇచ్చారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు పోలీసులు బదులిస్తూ.. నోటీసులు ఇవ్వలేదని తెలపడంతో హైకోర్టు సీరియస్ అయ్యింది. శిల్పా రవి రాకుండా డిబేట్ ఎలా జరుగుతుందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో.. రేపు ఉదయం 9.45 గంటల వరకు నంద్యాల వెళ్లకుండా నోటీసులు ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అటు.. రేపు ఉదయం వరకు నంద్యాల వెళ్లబోమని, అండర్ టేకింగ్ ఇస్తే తాము అఖిల ప్రియ నివాసం వద్ద నుంచి వెళ్లిపోతామని పోలీసులు చెప్పారు. ఇలా వాదోపవాదనలు విన్న తర్వాత.. నంద్యాల మినహా, అఖిల ప్రియ ఎక్కడైనా తిరగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే.. అండర్ టేకింగ్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. నోటీసు కూడా ఉపసంహరించుకోవాలని ఆర్డర్ చేసింది. సీఐకు అండర్ టేకింగ్ ఇవ్వాలని అఖిల ప్రియకు ఆదేశాలు జారీ చేసింది.

Bhuma Akhila Priya: శిల్పా రవికి ఛాలెంజ్.. ఆ ఆరోపణలు నిరూపించాలని డిమాండ్

ఇదిలావుండగా.. పరస్పర ఆరోపణల నేపథ్యంలో నంద్యాలలో బహిరంగ చర్చకు రావాలని శిల్పా రవిని భూమా అఖిల ప్రియ సవాల్ చేసిన సంగతి తెలిసిందే! అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఈ బహిరంగచర్చకు అనుమతి లేదని, అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నందున ఎందుకు చర్య తీసుకోకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆళ్లగడ్డలో అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. భూమా కుటుంబం ఆస్తుల ఆక్రమణ, భూదందా, సెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తోందంటూ శిల్పా రవి ఆరోపణలు చేశారు. తనని రెచ్చగొడితే చిట్టా విప్పుతానంటూ హెచ్చరించారు కూడా! ఇందుకు కౌంటర్‌గా అఖిల ప్రియ స్పందిస్తూ.. బహిరంగ చర్చకు రావాలన్నారు. పరస్పరం ఈ ఇద్దరి మధ్య సాగుతున్న వాడీవేడీ వ్యవహారంతో నంద్యాల రాజకీయాలు వేడెక్కాయి.

Borugadda Anil Kumar: నేను జగన్‌ వీరాభిమానిని.. ఆయన కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం..

Show comments