NTV Telugu Site icon

భారీవర్షాలతో శ్రీవారి మెట్టుమార్గం ధ్వంసం

తిరుమల భారీవర్షానికి భారీగా నష్టపోయింది. టీటీడీకి చెందిన అనేక ఆస్తులు ధ్వంసం అయ్యాయి. మెట్ల మార్గంలో వరద ఉద్ధృతి కారణంగా మెట్లు పాడయ్యాయి. భక్తులు నడిచి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయగా అవన్నీ వరదలలో కొట్టుకుపోయాయి. శ్రీవారి మెట్టు నడకమార్గంలో అనేక ప్రాంతాలో ధ్వంసమయ్యాయి మెట్లు.

500,600,800 మెట్ల వద్ద వరద ప్రవాహానికి కోతకు గురైంది మెట్ల మార్గం. మరమ్మతు పనులుకు వారంరోజులు సమయం పట్టే అవకాశం వుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి వుండకపోవచ్చంటున్నారు అధికారులు.తిరుమల ఘాట్ రోడ్ ను మూసివేసింది టీటీడీ. దట్టమైన పొగమంచు కారణంగా నిర్ణయం తీసుకుంది.