రాగల 24 గంటల్లో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం పట్టడంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రెండు రోజుల నుంచి ఏపీలో ఎండ తీవ్రతతో పలు చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉండడంతో రైతులు, మత్య్సకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు.