Site icon NTV Telugu

Weather Updates : ఏపీకి భారీ వర్ష సూచన..

Rain Alert

Rain Alert

రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాకులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయవ్యంగా పయనించి నిన్న దక్షిణ ఝార్ఖండ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. దీంతో.. అక్కడే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.

ఇదిలా ఉంటే.. అరేబియా సముద్రం నుంచి మధ్యభారతం మీదుగా బలమైన గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు. వీటి ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారు. కాగా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల నిన్న ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్ల విరిగిపడ్డాయి.

 

 

Exit mobile version