విధి ఎంత బలీయమైనదో చూడండి.. డ్యూటీలో ఉన్న కండక్టర్..సొంతూరు కు వెళ్తున్న ఓ వృద్ధురాలు గుండెపోటు బస్సులోనే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన కె.ఈశ్వరరావు(51) శృంగవరపుకోట డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం కొట్టాం-విశాఖ-కించుమండ రూట్‌లో విధులకు వెళ్లి తిరిగి వస్తూ.. అస్వస్థతగా ఉందని డ్రైవర్‌కు తెలిపారు. కొద్ది క్షణాల్లోనే కూర్చున్న సీటులో ఒరిగిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. అప్పటికే గుండె పోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలం మహసింగికి చెందిన ఇసై పగడాలమ్మ(60) చినముషిడివాడ సమీపంలో కుమారుని వద్ద ఉంటోంది. మంగళవారం సొంతూరుకు వెళ్లేందుకు చిన్నముషిడివాడలో సిటీ బస్సెక్కారు. వేపగుంట వద్దకు వచ్చేసరికి బస్సులోనే సొమ్మసిల్లి సీటు నుంచి కింద పడిపోయారు. దీంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. కానీ అప్పటికే ఆమె గుండె పోటుతో చనిపోయిందని సిబ్బంది తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.Give English URL, SEO Meta Title, SEO Meta Description, SEO Meta Keywords in English
