Harish Kumar Gupta Appointed as AP New DGP: ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు ఈసీ బదిలీ చేసింది. తాజాగా ఏపీ డీజీపీ కే.వీ రాజేంద్రనాథ్ రెడ్డి మీదఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి రిలీవ్ అవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ఈసీ పేర్కొంది.
OTT Movies : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు..
ఈ ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంక్ పేర్లు పంపాలని ప్రభుత్వానికి ఈసీ సూచించింది. కొత్త డీజీ నియామక ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగా ప్రభుత్వం సీనియారిటీ దామాషాలో ద్వారకా తిరుమల రావు, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లు సిఫారసు చేసింది. అయితే, ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక తాజా నియామకం నేపథ్యంలో, తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది.