NTV Telugu Site icon

సిఎమ్ స్వయంగా క్షమాపణ చెప్పాలి : జీవీఎల్

రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో బిజేపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది, ఆనవాయితీగా అందరూ చేస్తారు. కానీ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి మాత్రం గూడూరు లో చర్చి కెళ్లి బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారు. గురుమూర్తి హిందువా..!? కాదా..!? స్పష్టంగా చెప్పాలి. రాజ్యాంగంలోని “షెడ్యూల్ కాస్ట్ 1950” ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతం కాకుండా, అన్యమత ధర్మాన్ని పాటించే షెడ్యూల్డ్ కులాల వారి నెవరినైనా  కూడా ఎస్.సి లు గా గుర్తించబడరు. దీని ప్రకారం గురుమూర్తి రిజర్వుడు స్థానమైన తిరుపతి స్థానం నుంచి పోటీ చేసే అర్హత లేదు అని ఆయన అన్నారు.  గురుమూర్తి హిందూ ధర్మాన్ని పాటించరా…!? ఒక వేళ పాటిస్తే నాయకుడికి నచ్చదని శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించుకోలేదా…!? స్పష్టం చేయాలని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం, వైసీపీ దేవుడు పేరుతో కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తోంది ఇది రాజ్యాంగ విరుద్ధం, దీనికి సి.ఎమ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.