Pemmasani Chandra Sekhar: గుంటూరు కలెక్టరేట్ లో బ్యాంకర్లతో సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. గుంటూరు పార్లమెంటులో ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.. అవి ప్రజలకు ఎంత వరకు చేరువ అవుతున్నాయి అనే అంశంపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాం.. బ్యాంకుల్లో అన్ క్లైమ్డ్ నగదు నిల్వలు ఉన్నాయి.. వాటిని ఎలా లబ్దిదారులకు అందించాలనే అంశంపై దృష్టి పెట్టామని చంద్రశేఖర్ తెలిపారు.
Read Also: Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా
అయితే, కార్పొరేట్ బ్యాంకుల పని తీరు సరిగ్గా లేదని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. మరో మూడు నెలలు సమయం ఇచ్చి చర్యలు తీసుకుంటాం.. కౌలు రైతులకు గత ప్రభుత్వం రూ. 180 కోట్లకు గాను కేవలం 30 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చింది.. కూటమి ప్రభుత్వం ద్వారా రూ. 110 కోట్ల రుణాలు అందించాం.. కౌలు రైతుల రుణాలు సక్రమంగా వసూలు కావటం లేదని బ్యాంకర్లు చెప్పారు.. ప్రతి స్కీం అర్హులైన వారికి చేరువయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
