Pemmasani Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారింది.. ఇప్పటికే కీలక వ్యాఖ్యలు అరెస్ట్ కాగా.. ఈ కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జరగుతోంది.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు.. ఏం ఆధారాలు లేకుండా ఎంపీని అరెస్టు చేయరన్నారు.. అయితే, బిగ్ బాస్ ను కూడా ఆధారాలు దొరకగానే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.. ఈ స్కామ్ లో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని వెల్లడించారు పెమ్మసాని..
Read Also: వైట్ డ్రస్ లో బ్యాక్ అందాలతో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్..
ఇక, సూపర్ సిక్స్ తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు పెమ్మసాని చంద్రశేఖర్.. గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఫించన్ పెంచడానికే ఐదేళ్లు పట్టింది.. గత ప్రభుత్వం రైతు భరోసా పదమూడు వేలే ఇచ్చింది. మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పాం. కేంద్రంతో కలిపి మూడు విడతల్లో ఇస్తున్నాం అన్నారు… ఇక హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు.. ఏం అమలు చేయలేదు.. ఎక్కడో చెప్పండి అంటూ నిలదీశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
