Site icon NTV Telugu

Minister Nadendla: తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం..

Nadendla

Nadendla

Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు.
చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read Also: Revanth Reddy : వరంగల్ కు సీఎం రేవంత్.. ముంపు ప్రాంతాల్లో పర్యటన

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు‌ ఇబ్బందులు లేకుండా చూశారు.. విపత్తులు మన చేతిలో ఉండవు.. తుఫాన్ సమయంలో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది.. ప్రాణ, పశు, అస్థి నష్టం ఉండొద్దనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం కష్టపడి పని చేసింది.. ఇప్పుడు వచ్చిన తుఫాన్ ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పునరావాస కేంద్రాలకు ప్రజలు వచ్చే విధంగా అధికారులకు సహకరించాలి అని మంత్రి నాదెండ్ల కోరారు.

Read Also: Bollywood : సల్మాన్ ఖాన్ పై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

అయితే, దేవుడి దయతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో 4 వేల 553 మందిని గుర్తించి ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం.. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యటంలో ఎక్కడ వెనకడుగు వేయటం లేదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అభివృద్ధి, ప్రజల కోసం సమగ్రంగా వినియోగిస్తాం.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని తెలిపారు.

Read Also: Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.

ఇక, మత్య్సకారులు, చేనేత కార్మికులకు 50 కిలోలు బియ్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఖచ్చితమైన మార్పు తెచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తుందని వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి మనోహర్ చెప్పుకొచ్చారు.

Exit mobile version