NTV Telugu Site icon

Nandigam Suresh: నేడు పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ నందిగం సురేష్..

Nandigama

Nandigama

Nandigam Suresh: గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అయితే, టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు సహాకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక‌.. ఎవ‌రు ఉన్నారనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి (మంగళవారం) మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయ‌డానికి, దూషించ‌డం, భ‌య పెట్టడం లాంటివి చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా త‌మ న్యాయ‌వాదుల‌ను కూడా విచార‌ణ‌కు అనుమ‌తించాల‌ని నందిగం సురేష్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ల‌ను న్యాయస్థానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

Read Also: Train Accident : ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు

కాగా, దీనికి సంబంధించి ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేస్తే.. దానిని ప‌రిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని మంగళగిరి కోర్టు పేర్కొనింది. ఇదిలావుంటే.. నందిగం సురేశ్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ తీవ్ర ఆరోప‌ణ‌లను ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీసు కేసులో ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చినా.. ఈ కేసులో మ‌రోసారి అరెస్టు చేసే ఛాన్స్ ఉంద‌ని సమాచారం.

Show comments