Site icon NTV Telugu

Aghori Puja: శివాలయం ముందు అర్థరాత్రి అఘోరీల పూజలు.. భయంలో ప్రజలు

Agoris

Agoris

Aghori Puja: గుంటూరు రూరల్ మండలంలోని రెడ్డిపాలెం గ్రామ శివాలయంలో అఘోరీల ప్రత్యేక పూజలు నిర్వహించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేపుతుంది. అర్ధరాత్రి వేళల్లో శివాలయానికి చేరుకున్న అఘోరీలు నెత్తిపై చట్టీ మంటలతో పూజలు నిర్వహించారు. అలాగే, శివాలయంలో దీపాలు వెలిగించి, మంత్రోచ్చారణలతో పూజలు చేయడంతో గ్రామస్తుల ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Read Also: Gold Price Today: ఆల్ టైమ్ రికార్డ్.. రూ. లక్షా 10 వేలు దాటిన తులం గోల్డ్ ధర.. నేడు రూ. 1360 పెరిగింది..

అయితే, జన సంచారం ఉండే ప్రాంతంలో అఘోరీలు నెత్తిపై మంటలు పెట్టుకుని పూజలు చేయడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. ఇక, ఆలయంలో అఘోరీలు నిర్వహించిన పూజలపై స్థానికులు విభిన్న రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్ని భయపెట్టేలా రాత్రిపూట ఇలా పూజలు చేయడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తుండగా, ఇలాంటి పూజలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తాయని ఇంకొందరు అంటున్నారు.

Exit mobile version