Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, గుంటూరులో మరొకసారి ఓ కెమికల్ ఇండస్ట్రీ లో మంటలు చెలరేగాయి.. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.. రెండు రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. దాని మంటలు ఆర్పి.. ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే, మరొకసారి అదే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారని, ఇది తమకు ఎలాంటి ముప్పు చేకూరుస్తుందో తెలియక భయపడుతున్నామని స్థానికులు అంటున్నారు.. ప్రమాదం జరిగిన వెంటనే, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో, రెండు ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా, ఇళ్ల మధ్యలో నడుపుతున్న ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Paralympic 2024: పారాలింపిక్స్ విజేతలకు భారీ నజరానా.. పసిడికి రూ.75 లక్షలు!