NTV Telugu Site icon

Pawan Kalyan: ఉద్యోగం ఇప్పించండి సార్.. డిప్యూటీ సీఎంకు దివ్యాంగురాలు విజ్ఞప్తి

Pawan Kalyab

Pawan Kalyab

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లీయర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also: T20 World Cup 2024: టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ బౌలింగ్

మరోవైపు.. ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్‌లో గత పదేళ్లుగా హెల్పర్‌గా పని చేస్తున్న తనను.. మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపింది. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకుంది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Read Also: Chittoor: వీడిన పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ..

Show comments