NTV Telugu Site icon

కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..

GMO

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా నివార‌ణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ స‌మావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జ‌రిగిన‌ జీఎంవో స‌మావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజ‌ర‌య్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్, కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు స‌హా.. పలు అంశాలపై చ‌ర్చించారు.. బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అన్ని చర్యలు పటిష్టంగా అమలు జ‌ర‌గాల‌ని.. ప్రాణాలు తెగించి రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్స్, వైద్య, శానిటరీ, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది ఈ స‌మావేశం.

ప్రతీ ఆస్ప‌త్రిలో 50 శాతం ఆరోగ్య శ్రీ పెషేంట్స్ కు బెడ్స్ ఇవ్వాల‌ని స్ప‌ష్టం జీఎంవో.. ప్రవేట్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జ‌ర‌గాల‌ని.. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆస్ప‌త్రుల‌పై చర్యలకు వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశించిన‌ట్టు గుర్తుచేశారు.. ఇక‌, ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాల‌ని.. ప్రతి ఆస్ప‌త్రిలో కరోనా పెషేంట్స్ కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాల‌ని.. రెమిడీసివర్ ఇంజక్షన్స్ లో బ్లాక్ లో విక్రయిస్తే కఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఈ ఇంజ‌క్ష‌న్లు అన్ని ఆస్ప‌త్రుల్లో అందుబాటులో ఉంచాల‌ని.. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన క‌ల్పించాల‌ని.. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే ఆస్ప‌త్రుల‌పై కఠినంగా వ్యవహారించాల‌ని నిర్ణ‌యించారు.