తూర్పు పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీవో భవనంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేసారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణం రెగ్యులరైజ్ చేయాలి. సిపిఎస్ రద్దు విషయాన్ని ప్రకటించాలి. ప్రభుత్వ విద్యారంగ మార్పులు వినాశనానికి దారి తీస్తాయి అని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ప్రాథమిక పాఠశాల విద్యారంగ పరిరక్షణకు ఉద్యమిస్తాం అని ఆయన పేర్కొన్నారు.