టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా నారాయణ అరెస్ట్ అంశంపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పందించారు. ఏపీలో పాశవిక పాలన నడుస్తోందంటూ ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు. అయితే తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని ప్రచారం చేసుకున్న జగన్ ఎక్కడ?
జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. నవరత్నాలు బోగస్ అని.. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లడానికి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అక్రమాలు, అవినీతిపై వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని గోరంట్ల బుచ్చయ్చ చౌదరి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ పొత్తులను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మోస పోయాం అని జనాలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు.#గోరంట్ల#YsrcpLootingApPeople pic.twitter.com/lAR0NImG0P
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) May 11, 2022