Site icon NTV Telugu

ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..! సబ్సిడీపై ఎలక్ట్రిక్ స్కూటర్లు

Electric Vehicles

Electric Vehicles

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సబ్సిడీపై ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనుంది వైఎస్‌ జగన్ సర్కార్.. ఉద్యోగులకు అవసరమైతే సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.. మిగతా మొత్తాన్ని వాయిదా పద్దతిలో చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్ సంస్థలు రాయితీ ఇస్తాయని స్పష్టం చేసింది సర్కార్… ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి అందించదని పేర్కొంది.. వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి నెల వారీగా వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.. దీనికి సంబంధించి సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.. నెలకు రూ. 2500 వరకూ వాయిదా చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు..

Exit mobile version