Site icon NTV Telugu

ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్

క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువు ను పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

ఇవాళ్టి నుంచీ ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లే బస్సుల్లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య తిరిగే అన్ని దూరప్రాంత బస్సుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు చాలా మేలు జరుగనుంది. ఇక ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version