NTV Telugu Site icon

ఫైబర్‌ నెట్‌ స్కాంపై గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !

విశాఖ : ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతుందని… గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారని… టెరా సాఫ్ట్ కు కాంట్రాక్ట్‌ లు ఇచ్చేప్పుడు అప్పటి మoత్రి మండలి ఏం చేసిందని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా…!? అని ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు తర్వాత బాధ్యులైన అందరు బయటకు వస్తారు…. వారిలో ఐ.ఏ.ఎస్.లు ఉండవచ్చని తెలిపారు.

ఏపీ ఎస్.ఎఫ్.ఎల్ సేవలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. సామర్ధ్యం పెంచడం ద్వారా వినియోగ దారులకు మెరుగైన సేవలు అందిస్తామని… రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో విశాఖలోని ఫైబర్ నెట్ నెట్ వర్క్ విస్త్రతం అవుతుందని వెల్లడించారు. ట్రిపుల్ ప్లే నెట్వర్క్ బాక్స్ లు త్వరలోనే వినియోగదారులకు చేరుస్తామని.. రెండు లక్షల కనెక్షన్లు తక్షణ మే పెంచాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. 4800 గ్రామాలకు నెట్ వర్క్ విస్తరించామని వెల్లడించారు.