Site icon NTV Telugu

Gandhi Jayanti Effect: మాంసం విక్రయాలపై గాంధీ జయంతి ఎఫెక్ట్.. దసరా రోజు మద్యం, నాన్వెజ్ లేకపోతే ఎలా..?

Gandhi

Gandhi

Gandhi Jayanti Effect: ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం లవర్స్ కి బిగ్ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజునే దసర పండగా కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్‌ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. గాంధీ జయంతి నాడు మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లను మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా మద్యం, మాంసం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో దసర పండగా నాడు చుక్కా ముక్కా తప్పనిసరి కానీ, ఆ రోజు గాంధీ జయంతి వస్తుండటంతో మాంసం వ్యాపారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

Read Also: PoK Protests: పీఓకేలో అదుపుతప్పిన పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?

అయితే, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి, దసరా పండుగ రెండు కూడా ఒకే రోజు రావడంతో నాన్ వెజ్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. గాంధీ జయంతి రోజున మాంసం అమ్మకాలపై నిషేధం ఉండటంతో షాపులను తెరిచే పరిస్థితి లేదు. దీంతో విజయవాడ నగరంలో చికెన్ అమ్మే వ్యాపారులకు సంబంధించి సుమారు 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లగా, మటన్ అమ్మకాలకు సంబంధించి కూడా 50 నుంచి 80 లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు వాపోతున్నారు. మాసం మార్కెట్లు కూడా పూర్తిగా ఆ రోజున మూతపడతాయి. కాబట్టి, పండగ వల్ల వచ్చే ఆదాయం మొత్తం కోల్పోతున్నట్టు నాన్ వెజ్ వ్యాపారులు చెబుతున్నారు.

Exit mobile version