Site icon NTV Telugu

Yellow Frogs: అక్కడ కప్పలు రంగులు మారుస్తాయ్

Frogs

Frogs

సాధారణంగా మనం ఊసరవెల్లి రంగులు మార్చడం గురించి చదివాం. రాజకీయ ఊసరవెల్లులను మనం చూశాం. కానీ నిత్యం మన ఇంటిముందు కనిపించే కప్పల గురించి విన్నారా. కప్పలు కూడా రంగులు మారుస్తాయని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. అది కూడా గోదావరి జిల్లాల్లో ఈమధ్య కప్పలు రంగులు మారుస్తున్నాయ్. కోనసీమ జిల్లాలో కప్పలు పసుపు రంగులో కనిపించాయి. అమలాపురం మండలం బండారులంక పొలాల్లోని వర్షపు నీటిలోకి పసుపు రంగులో ఉన్న కప్పలు చేరాయి.

ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు చెబుతున్నారు. ఇలా కనిపించడం ఆశ్చర్యంగా వుందని రైతులు చెబుతున్నారు. ఈ వీడియోను ఇక్కడి జనం వైరల్ చేశారు. అయితే పశువైద్యశాఖ అధికారులు మాత్రం వీటిపై వివరణ ఇచ్చారు. ఖాకీ రంగులో ఉండే కప్పలు వర్షాకాలంలో ఇలా ఊసరవెల్లి తరహాలో ఒక్కోసారి రంగులు మార్చుకుంటాయని చెబుతున్నారు. రాజోలు వెటర్నరీ వైద్య అధికారి శివకుమార్ ఎన్టీవీకి తెలిపారు. బుల్ ఫ్రాగ్స్ అని పిలిచే మగ కప్పలుసంతానోత్పత్తి జరిగే బ్రీడింగ్ సీజన్లో ఆడకప్పలను ఆకర్షించడానికి పసుపు రంగులోకి మారతాయని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయంటున్నారు. అద్గదీ సంగతి.

Perni Nani: పవన్ కళ్యాణ్ ది వీకెండ్ ప్రజాసేవ.. పేర్ని నాని ఎద్దేవా

Exit mobile version