Site icon NTV Telugu

Students Died: అనకాపల్లిలో అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నలుగురు మృతి

Anakapalle

Anakapalle

Students Died: అనకాపల్లి జిల్లాలోని కోటవుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హూటాహూటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక, తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్ లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

Read Also: Kolkata Rape Case: సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ..

కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. డిప్యూటీ డీఈఓ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. కైలాసపట్నంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version