Site icon NTV Telugu

Forgery case: ఏపీ జనసేన జెడ్పీటీసీపై ఫోర్జరీ కేసులు

Zptc

Zptc

ఏపీలో జనసేన తరఫున గెలిచిన ZPTCపై తెలంగాణలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లను అక్రమంగా దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పిటిసి, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై ఫోర్జరీ కేసులు నమోదుచేశారు పోలీసులు. ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Read Also: Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై తొలగిన వివాదం.. ఏర్పాట్లు పూర్తి

ఈ వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పిటిసి, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందం పాత్ర వుందని, తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలోని 32జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణాలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు సిద్ధం అయింది. బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన పత్రాలు నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు.

Read Also: Gender Equality: లింగ సమానత్వం సాధించడానికి మరో 300 ఏళ్లు.. యూఎన్ఓ నివేదిక

Exit mobile version