Site icon NTV Telugu

కోనేటిరాయుడి పూజలకు పుష్పాలు కరువు

దేవుడి పూజకు ఎక్కడైనా వివిధ రకాల పూవులు దొరుకుతాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న కీలపట్ల కోనేటిరాయస్వామికి పుష్పాలు కరువు అయ్యాయి. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు హిందూ పరిరక్షణ సమితి సభ్యులు. అక్కడ పుష్పాలంకరణ లేని కారణంగా అదేంటని అక్కడి అధికారులను వివరణ కోరగా,, గత కొన్ని నెలలుగా టిటిడి వారు పుష్పాలను సరఫరా ఆపేశారని తెలియజేశారు.

హిందువుల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బతినే పరిస్థితి ఎదురుకాకూడదన్నారు. గత మాసంలో కూడా హిందూ పరిరక్షణ సమితి వారి సహాయంతో పుష్పాలను సమకూర్చినట్లు తెలిపారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారిని స్వామివారికి పుష్పాలను గతంలో లాగానే సమకూర్చి సరఫరా చేయవలసిందిగా వారు కోరుతున్నారు.

Exit mobile version