గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాఫర్ డ్యామ్ దగ్గర నీటిమట్టం 27 మీటర్లకు చేరింది. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు చేరింది. వరద నీరు పెరుగుతుండటంతో ఆలయంలోకి భక్తులను నిరాకరించారు. దేవీపట్నం మండలంలోని పలు గ్రామలు ముంపు భయంలో నిండిపోయాయి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ధ నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది.
Read: అదిరిపోయిన “ఏజెంట్” లుక్.. షూటింగ్ అప్డేట్