Site icon NTV Telugu

ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం…

మన దేశంలో ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదవుతుండగా… ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తూ ఉంది. అయితే తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఆ జిల్లాలోని నిడదవోలు పాత పశువుల హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అంజిబాబు అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు అనుమానం రేకెత్తుతుంది. అయితే 15 రోజుల క్రితం కరోనా నుండి కోలుకున్న అంజిబాబుకు గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుంది. దాంతో ఆసుపత్రికి వెళ్లి సిటీ స్కాన్ చేయగా బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయట పడటంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.

Exit mobile version