విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా, అర్ధరాత్రి సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు అధికారులు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఎంటి అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ జిల్లాను భయపెడుతున్న అగ్నిప్రమాదాలు… అర్ధరాత్రి మరో ప్రమాదం…
