NTV Telugu Site icon

Central Funds: కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఇవే.. ఆర్థిక మంత్రి ప్రకటన

Central Funds

Central Funds

Central Funds: కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన నిధులకు సంబంధించిన వివరాలను శాసన మండలిలో ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను మండలిలో ప్రస్తావించారు.. 2023-24 వార్షిక బడ్జెట్ లో భాగంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.41,338 కోట్ల కేటాయింపులు వచ్చాయని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన ప్రకారం, స్థానిక సంస్థలకు సంబంధించి రూ.8,077 కోట్లు కేటాయింపులు వచ్చాయని.. అయితే, కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా ఏపీకి రావాల్సిన నిధులు రూ.19,794 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.30 కోట్లు, అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి రూ.40 కోట్లు, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.168 కోట్లు, గుంటూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి రూ.23.20 కోట్లు, అనంతపురం ప్రశాంతి నిలయానికి రూ.12 లక్షలు కేటాయించినట్టు శాసనమండలిలో వెల్లడించారు ఆర్థిఖశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

Read Also: Finance Bill: లోక్‌సభలో ఆర్థిక బిల్లుకు ఆమోదం.. పింఛను వ్యవస్థను పరిశీలించేందుకు కమిటీ