NTV Telugu Site icon

తాడిపత్రిలో విషాదం.. తండ్రి తిట్టాడని కొడుకు…

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విషాదం నెలకొంది. తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.పట్టణంలోని విజయ నగర్ కాలనీకి చెందిన నాగయ్య అనే హమాలీ మొదటి కుమారుడు నవీన్ యాదవ్(21) పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్నాడు. గత కొద్దిరోజులుగా నవీన్ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి నవీన్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తండ్రి నవీన్‌కి ఫోన్ చేసి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ రాత్రి ఇంటికి వెళ్లకుండా బయటే ఉన్నాడు. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.