Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు ఏ1 జనార్ధన్ తాజాగా విడుదల చేసిన వీడియోలో, జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశాను చెప్పడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..
అలాగే, నిందితుడు జనార్ధన్ ఆఫ్రికా వెళ్లే ముందు రోజు మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసానికి వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారాన్ని ధృవీకరించేందుకు పోలీసులు జోగి రమేశ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్ లను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా జోగి నివాసంతో పాటు సమీప ఇళ్లలో ఉన్న సీసీ టీవీ కెమెరాల నుంచి ఫుటేజ్‌ను కూడా సేకరిస్తున్నారు. ఈ వీడియో ఆధారాలపై జోగి రమేశ్ పాత్రపై మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
