NTV Telugu Site icon

Facial Recognition Attendance: కొత్త ఏడాది.. సరికొత్త రూల్స్.. సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీసుల్లోనూ అమల్లోకి

Facial Recognition

Facial Recognition

ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక ఇప్పుడో లెక్క.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కొన్ని విభాగాలకే పరిమితమైన ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌.. అక్రమంగా అన్ని విభాగాలకు, అన్ని కార్యాలయాలకు విస్తరిస్తూ వస్తోంది ప్రభుత్వం.. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర సచివాలయం, జిల్లా కేంద్ర కార్యాలయాలు, హెచ్‌వోడీ ఆఫీసుల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. అయితే, వీకెండ్‌ సెలవులతో ఇంకా యాప్ డౌన్ లోడ్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో.. కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పడంలేదట.. దీనిపై జనరల్ జీవోనే విడుదల అయ్యాయి.. కానీ, విభాగాల వారీగా అంతర్గత ఆదేశాలు జారీ కాలేదని చెబుతున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు.. స్మార్ట్ ఫోన్లు లేనివాళ్ల హాజరు పరిస్థితి ఏంటి? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. యాప్ డౌన్ లోడ్, తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

Read Also: KA Paul: తొక్కిసలాటపై పాల్‌ ఫైర్‌.. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేది..

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లోను అమలు చేయనున్నారు. మరోవైపు అటెండెన్స్‌పై ప్రభుత్వ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినా.. ఇవాళ్టి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌ తప్పనిసరి చేశారు. ఉద్యోగులు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులతో పాటు డీడీవోలకు యాప్‌ వినియోగంపై మార్గదర్శాలు ఇప్పటికే జారీ అయ్యాయి.. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు, బాధ్యతలు, తీసుకునే జీతం వంటి సమాచారాన్ని బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.. మొత్తంగా కొత్త ఏడాదిలో సరికొత్త కొత్త రూల్స్‌ అమల్లోకి తెచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అమల్లోకి వచ్చింది. ఆలస్యంగా కార్యాలయాల్లోకి వచ్చే ఉద్యోగులు కూడా ఉదయాన్నే కార్యాలయాలకు చేరుకున్నారు.. చిన్నపాటి సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధికారులు వెంటనే పరిష్కారిస్తున్నారని చెబుతున్నారు.. మరోవైపు.. ఒంగోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నేషన్ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. యాప్ లో తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఉద్యోగులు తంటాలు పడడ్డారు.. నమోదు చేసుకున్నా సాంకేతిక సమస్యలతో యాప్ లో హాజరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. యాప్ పై అసలు అవగాహన లేకపోవటంతో ఎలా హాజరు వేసుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు ఉద్యోగులు.. ఫోన్ నంబర్, ఈ కేవైసీ కూడా ఆప్ డేట్ కావటం లేదని గగ్గోలు పెడుతున్నారు.. ఆఫీస్ లొకేషన్ అప్ డేట్ కావటంతో సమస్యలతో ఉద్యోగుల్లో గందరగోళం ఏర్పడింది.. అటు, కడప ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ఫేస్ రికగ్నేషన్ అంటెడెన్స్‌ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు.. సీఎఫ్ఏంఎస్ లో ఇచ్చిన మొబైల్ నంబర్ వేరుగా ఉండటంతో మొబైల్ యాప్ లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. అయితే, రెండు మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Show comments