Site icon NTV Telugu

నా బ్యాటరీ బండెక్కి వచ్చెత్తా.. మాజీ ఎంపీ హర్షకుమార్ సమ్‌థింగ్ స్పెషల్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విపక్షాలు తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పెట్రోల్ పెంపునకు నిరసనగా మాజీ ఎంపి హర్షకుమార్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు

తన నివాసం నుంచి తన విద్యాసంస్థల వరకు బ్యాటరీ వాహనంపై ప్రయాణించి నిరసన తెలిపారు హర్షకుమార్. కేంద్ర ప్రభుత్వం అర్ధంపర్ధం లేకుండా చమురు ధరలను పెంచుతోందని మండిపడ్డారు. పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే కనీసం.పన్నులు తగ్గించాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం హేయమయిన చర్య అని విమర్శించారు హర్షకుమార్.

Exit mobile version