ఏపీలో అధికార టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామంలో అక్రమంగా ఇల్లు కూల్చడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగారు బాధిత కుటుంబాలు. బాధితులకు మద్దతుగా బాధితులను పరామర్శించి సంఘీభావం తెలియజేసారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. బాధితులు తమ బాధను చెప్పుకుని భోరున విలపించారు.
ఆక్రమలను తొలగించిన ప్రాంతాన్ని పితాని సత్యనారాయణ పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికార మదంతో జరుగుతున్న రాజకీయ మచ్చుతునక రామన్నపాలెంలో చోటుచేసుకుంది అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య స్థానిక శాసనసభ్యులు చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. అధికార మదంతో స్థానిక శాసనసభ్యులు రంగనాథరాజు… కోర్టులో ఉన్న అధికారులను భయభ్రాంతులకు గురి చేసి పనులు చేస్తున్న పరిస్థితి దారుణం అన్నారు. స్థానిక కాపులు, శెట్టిబలిజలను రెచ్చగొడితే 2024 ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని కక్షపూరిత చర్యలకు శాసనసభ్యులు పాల్పడుతున్నారన్నారు.
కోర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ప్రాంతంలో స్థానిక శాసనసభ్యుల డైరెక్షన్లో 120 కొబ్బరి చెట్లు నరికి.. పోలీస్ బలగాలతో మహిళలను చూడకుండా ఇంట్లోంచి బయటికి లాగి దొర్లించిన పరిస్థితి ఏర్పడిందన్నారు..పోరంబోకు స్థలాల్లో ఉన్న మీ పార్టీ నేతల అక్రమణలు తొలగించలేదు.. మీ కో న్యాయమా మాకో న్యాయమా అని పితాని ప్రశ్నించారు.. న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు పితాని సత్యనారాయణ.
OTR: రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సొంత జిల్లాలో తప్పని చిక్కులు
