NTV Telugu Site icon

Murder For Lady: తాగిన మైకం.. యువతి కోసం స్నేహితుడి దారుణం

Friend Murder

Friend Murder

తాగిన మైకం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. యువతి కోసం తాగిన మైకంలో తోటి స్నేహితుడినే దారుణంగా కొట్టి చంపి అతి తెలివితో బయట పడదాం అనుకున్నాడు…కానీ ఆఖరికి కటకటాల పాలయ్యాడు….అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఇద్దరు వ్యక్తులకు పెళ్ళి కానీ ఓ మహిళతో ఏర్పడిన అక్రమసంబంధం హత్య కు దారి తీసింది..అమ్మాయి కోసం జరిగిన ముష్ఠి యుద్ధంలో ఒకరు బలై,మరొకరు జైలుకు వెళ్లి కుటుంబాల్ని రోడ్డున పడేసారు. .గత కొంత కాలంగా వివాహేతర సంబంధాలతో జరుగుతున్న హత్యలు దారుణంగా ఉంటున్నాయి.

తాగిన మైకంలో పెళ్ళాం,పిల్లల్ని వదిలేసి పరాయి ఆడదాని కోసం చంపటానికి లేదా తాము చావటానికైనా సిద్ధం అవుతున్నారు. తాజాగా జరిగిన మర్డర్ కూడా అదే కోవలోకి వస్తుంది..ఒక యువతి కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కాస్త హత్య కు దారితీసింది…ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలులో ఈ దారుణం చోటు చేసుకుంది…మృతుడు పాపట్ల వంశీకి.. హత్యకు పాల్పడిన రాయల జగదీష్ కు పెళ్ళై పిల్లలు కూడా వున్నారు..గత కొంత కాలంగా ఇద్దరు ఒకే దగ్గర జేసీబీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

అలా కొద్దిరోజుల క్రితం వీరిద్దరికీ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ లో పని చేస్తున్న జగయ్యపేట కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది…రెగ్యులర్ గా ఆమెతో మాట్లాడే వీరి ఇరువురి మధ్య గొడవలు రాసాగాయి. అలా గత పది రోజుల క్రితమే వీరు పని చేస్తున్న చోట గొడవ పడటంతో వీరి యజమాని మందలించి గొడవ ఆపాడు…అక్కడ ఆగిన గొడవ కాస్త పథకం ప్రకారం హత్య చేసే వరకు వెళ్ళింది. .దసరా కావటంతో యజమాని ఇచ్చిన మాములు తీసుకుని ఇద్దరు మరో నలుగురు స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకోవటానికి వెళ్లారు. రాయల జగదీష్ భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి మృతుడు వంశీతో బాగా తాగించి గొడవపడి హత్య చేసాడు.

ఆ సమయంలో అతనికి తోటి స్నేహితులు కూడా సహకరించారు. దీంతో వంశీ హత్య మరింత సులువైంది…ఆపై హత్య నుండి తప్పించుకునేందుకు మృతడు వంశీ బట్టలు మొత్తం తీసేసి ఎన్ ఎస్పీ కాలువలో పడేసారు…అంతేకాకుండా మద్యం సేవించిన తర్వాత వంశీ మత్తులో పడిపోయి ఉన్నాడని తిరిగి మరల వెళ్లి చూసేసరికి వంశీ కనిపించడం లేదంటూ ఓనర్ వెంకటేశ్వరరావుకు చెప్పి వత్సవాయి స్టేషన్ పరిధిలో కేసు పెట్టేందుకు వెళ్లారు నిందితులు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు అందరితో కలిసి స్నేహితుడి కోసం వెతుకుతున్నట్లు డ్రామా ఆడారు….ఆలా సుమారు 20 కిలో మీటర్లు కొట్టుకుని వచ్చిన మృత దేహాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని తేల్చి నిందితులను అరెస్ట్ చేసారు..

హతడు వంశీకి, నిందితుడు జగదీష్ కి నిండా పాతికేళ్ళు కూడా లేవు …రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. వీళ్ళపైనే ఆధారపడ్డ పెళ్ళాం బిడ్డలు ఇప్పుడు దిక్కులేని వారు అయిపోయారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా యువతి కోసం గొడవపడి రెండు కుటుంబాలను రోడ్డున పడేశారు.