Site icon NTV Telugu

Andhra Pradesh: విద్యార్థులకు గమనిక.. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Exams

Exams

ఏపీలో విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక సమాచారం అందించింది. రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం నాడు ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్, జూలై 13న ఎడ్‌సెట్, లాసెట్, పీజీఎల్‌సీఈటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

అంతేకాకుండా జూలై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్, జూలై 22న ఈసెట్, జూలై 25న ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. కాగా ఈఏపీసెట్‌కు సంబంధించి జూలై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

https://ntvtelugu.com/ts-pecet-2022-notification-released/

Exit mobile version