Site icon NTV Telugu

Engineering Student Suicide: రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

Engineering Student Tarun S

Engineering Student Tarun S

Engineering Student Tarun Dies By Suicide In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగానే అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. పూతలపట్టు మండలం పోటుకనుమ గ్రామానికి చెందిన తరుణ్ (21).. పి. కొత్తపేట సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

అయితే.. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కళాశాలకు వెళ్లకుండా, ఇంటివద్దనే ఉంటున్నాడు. రోజులు గడుస్తున్నా ఆరోగ్యం కుదుట పడట్లేదు. మందులు వేసుకుంటున్నా, ఎలాంటి ఫలితం దక్కలేదు. దాంతో మానసిక వేదనకు గురైన తరుణ్.. పి. కొత్తకోట వద్ద రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ అబ్బాయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో, తరుణ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version