NTV Telugu Site icon

Marriage Fraud: మత్తెక్కించే అందమే ఆమె పెట్టుబడి.. పెళ్లికాని అబ్బాయిలే టార్గెట్‌గా మోసాలు

Marrige Ford

Marrige Ford

Marriage Fraud:పెళ్లంటే మూడు ముళ్లు, ఏడు అడుగులు అనే మాటలు ఇప్పటి కాలంలో కనుమరుగవుతున్నాయి. చాలా మందికి పెళ్లి అనేది టైం పాస్ గా మారుతుంది. పెళ్లి చేసుకోవడం.. అక్రమ సంబంధాల బాట పట్టడం పరిపాటిగా మారుతుంది. మరికొందరైతే నాలుగు ఆకులు ఎక్కవే చదివారండోయ్.. ఈ కాలంలో అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు. అది గమనిస్తున్న కొందరు అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలను ఎర వేసి పట్టుకుంటున్నారు. అబ్బాయిలకు అమ్మాయిల అందాన్ని ఎరగా వేయడం.. ఆ తరువాత వారిని పెళ్లి వరకు తీసుకురావడం వీరిపని. పెళ్లి వరకు రాగానే అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఎదురు కట్నం ఇవ్వాని నైస్ గా ఒప్పించడం. అయితే అబ్బాయిలు అమ్మాల వ్యామోహంలో పడి సరే అని ఎదురు కట్నం లక్షల్లో ఇచ్చి పెళ్లి చేసుకున్నారే అనుకోండి.. ఆతరువాత ఇక బాదుడే అబ్బాయిలకు. ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. పెళ్లై రెండు రోజులు కావడమే ఆలస్యం అబ్బాయిలపై కేసులు స్టార్ట్. లక్షలు డిమాండ్ చేసి ఆ డబ్బులు తీసుకుని పరార్ అయిపోతారు అమ్మాయిలు. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని ఫ్రాడ్ గా మార్చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళాముకు చెందిన లక్ష్మీశ్రావణికి 2020లో ఓ వ్యక్తితో వివాహమైంది.కానీ కొద్ది రోజులకే భర్త నుంచి విడిపోయింది. జల్సాలకు అలవాటు పడి మోసల బాట పట్టింది. అదే జిల్లా తిరువూరు మండలం తంగెళ్లబీడుకు చెందిన రేణుకతో ఆమెకు పరిచయం ఏర్పడింది. రేణుక మ్యారేజ్ బ్యూరోతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. లక్ష్మీశ్రావణి అందంగా ఉండడంతో ఇద్దరూ కలిసి ఆమె అందాన్ని ఎరగా పెట్టి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. అందుకు పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్ చేసేవారు. రేణుక తన దగ్గరకు రిలేషన్ షిప్ కోసం వచ్చే అబ్బాయిల్లో డబ్బున్న వారిని సెలెక్ట్ చేసేది. లక్ష్మీ శ్రావణి అనే అమ్మాయి ఉంటే ఎవరూ లేని అనాథ. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఇవ్వాల్సిందే అంటూ అబ్బాయిలను నమ్మించేది. ఇలా ఖమ్మం జిల్లా కల్లూరులో ఓ యువకుడు రూ.3 లక్షలు, కొత్తూరులో రూ.2లక్షలు తీసుకుని మోసం చేశారు.

చండ్రుగొండ మండలం గానుగపాడుకు చెందిన ఓ యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి రూ.5 లక్షల కట్నం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు. వారి వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని గత నెల 7న పెళ్లి చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఆ యువకుడిని వదిలించుకోవాలని లక్ష్మీశ్రావణి పథకం వేసింది. ఆ అబ్బాయి సంసారానికి పనికి రావని అభాండాలు వేసి అబ్బాయి ఇంట్లో గొడవ స్టార్ట్ చేసింది. అనంతరం రేణుక వారి వద్దకు వచ్చి లక్ష్మీ ప్రసన్నను అక్కడి నుంచి తీసుకెళ్లింది. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువకుని బంధువులు చండ్రుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టి చండ్రుగొండలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. పెళ్లి పేరుతో పెళ్లికాని అబ్బాయిలకు వలవేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MLA Lakshma Reddy: బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు.. లక్ష్మారెడ్డికి పెరుగుతున్న మద్దతు..