COVID 19: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా పంజా విప్పుతోంది.. తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.. ఏపీలో పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. తాజాగా, ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది.. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్య బృందం.. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. నాలుగురోజుల క్రితం శాంతినగర్ లో ఉండే ఇద్దరు వృద్ధులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారిద్దరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. ఇప్పుడు మరో నాలుగు కేసులు వెలుగు చూసినట్టు అయ్యింది.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. అయితే, కరోనా మహమ్మారి బారిన పడకుండా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..
Read Also: BLA: పాకిస్తాన్ మెడలు వంచుతున్న బలూచిస్తాన్ ఆర్మీ.. సురబ్ నగరం స్వాధీనం!
