Jana Sena – TDP: ఏలూరు నగర మేయర్ పీఠం జనసేనకే ఇవ్వాలని జనసేన ఏలూరు ఇంఛార్జ్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఈడా చైర్మన్ పదవులు తెలుగుదేశం పార్టీ నేతలకే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిని జనసేనకు కేటాయిస్తే.. ఇరు పార్టీల మధ్య బంధం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. అవసరమైతే జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఏలూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు మేయర్ పదవిపై జనసేన తన డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఏలూరు నగర మేయర్ పీఠాన్ని జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ అప్పలనాయుడు కోరారు. మేయర్ పదవి జనసేనకు ఇస్తే టీడీపీ–జనసేన బంధం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు మేయర్ పీఠం విషయంలో టీడీపీ, జనసేన మధ్య డిమాండ్లు, చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్పలనాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మేయర్ పదవి కేటాయింపుపై కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

