Alla Nani No More: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం నెలకొంది.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు.. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్.. అంతా ఆయన్ని ఆళ్ల నానిగానే పిలుస్తారు.. వయస్సు 57 ఏళ్లు.. 1969 డిసెంబర్ 30 ఏలూరులో జన్మించారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే, ఈ రోజు విశాఖపట్నంలోని తన గుండెపోటుతో ఆళ్ల నాని కన్నుమూశారు.. ఆళ్ల నాని 2004లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు ఏలూరు నుంచే ఎమ్మెల్యేగా సేవలందించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిప్యూటీ సీఎంగా.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు ఆళ్ల నాని.. అయితే, 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఆళ్ల నాని..

