చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పంట పొలాలపై ఏనుగులు గుంపులుగా వచ్చి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ఏనుగుల దాటి చేయడంతో భారీగా పంటనష్టం జరుగుతోంది. తోటకనుమ గ్రామపంచాయితీ దండికుప్పం పంట పొలాలపై ఏనుగుల గుంపులుగా విరుచుకుపడుతున్నాయి. పూతదశలో పంటను తినేసిసిన 20 ఏనుగుల గుంపు.. పది ఎకరాలకుపైగా వరి పంటను నాశనం చేశాయి. సుమారు అయిదు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోని, ఆదుకోవాలని అన్నదాతలు కోరారు. రెండు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా ఏనుగుల గుంపు చేస్తున్నాయి. సోలార్ కంచె ఏర్పాటు చేసి ఏనుగుల బారినుంచి రక్షించాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్న అన్నదాతలు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.
పంట పొలాలపై ఏనుగుల దాడులు.. 5 లక్షల ఆస్తి నష్టం
