NTV Telugu Site icon

East Godavari : ప్యారడేజ్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు, కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాజమండ్రిలో ప్యారడేజ్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న హోటల్ నుండి చికెన్ తీసుకుని వచ్చి రాజమండ్రి హోటల్ లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వినియోగదారుడు పెమ్మనబోయిన రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు పై అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేశారు. అయితే హైదరాబాద్ నుండి హోటల్ కు దిగుమతి చేసుకుని తయారుచేసిన చికెన్ టిక్కా, బిర్యానీ శాంపిల్స్ ను అధికారులు సేకరించారు.

ఆహార కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ డి.శ్రీనివాస్ హెచ్చరించారు. హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఎవరైనా ఆహార కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. తూనికలు, కొలతల శాఖ ఇన్స్ఫెక్టర్ శివ బాలాజీ మాట్లాడుతూ కోక్ డ్రింక్ కొలతల్లో తేడా గమనించామని, దీనిపై కేసు నమోదు చేశామన్నారు.