NTV Telugu Site icon

New Year buzz at Flower Market: పూల మార్కెట్‌లో న్యూ ఇయర్‌ సందడి.. బొకేలకు ఫుల్‌ డిమాండ్‌

Flower Market

Flower Market

New Year buzz at Flower Market: నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలకపాత్ర పోషిస్తాయి. పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తుంటారు. అయితే, పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం. కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్లో తయారయ్యే ఈ బొకేలు దేశం నలుమూలకు సరఫరా అవుతున్నాయి. నూతన సంవత్సర పూల బొకేలు సిద్ధం అవుతున్నాయి.. కడియం నుంచి దేశం నలుమూలలకు సరఫరా అవుతున్నాయి. ఈ నూతన సంవత్సర వేడుకలకు అవసరమైన బొకేలను రెండు రోజులు ముందు నుండే పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టారు. కడియపులంక కేంద్రంగా తయారయ్యే ఈ బొకేలకు ఎక్కడలేని డిమాండ్ ఉంది. కడియపులంకతో పాటు బుర్రిలంక, కడియం, కడియపుసావరం తదితర గ్రామాల్లో ఈ బొకేల తయారీ చేపడుతున్నారు. కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేసి రాష్ట్ర నలుమూలకు బస్సులు, రైళ్లు ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇదే మాదిరిగా ఈ బొకేలను ఆర్డర్లపై తయారు చేస్తున్నారు. వందలాది మంది ఇప్పుడు ఈ బొకేల తయారీలో నిమగ్నమై ఉన్నారు.

Read Also: UnstoppableWithNBK : రామ్ చరణ్ తో కలిసి పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన బాలయ్య

వంద రూపాయలు బొకే నుంచి ఆర్డర్ పై పదివేల రూపాయల విలువైన బొకేలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. బెంగుళూరు, ఊటీ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూలను దిగుమతి చేసుకొని బొకేలు తయారు చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాలకు ఇక్కడ బొకేలు పెద్ద మొత్తంలో తీసుకెళ్లి రిటైల్ గా అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ బొకేల తయారీలో ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకున్న జర్బరా, ఆర్కెడ్, స్నోన్ బాల్, గ్లాడ్, తార్నుషన్, రిషాంత్, డచ్చీ రోజెస్ వంటి ఖరీదైన పూలను వినియోగిస్తారు. మార్కెట్‌లో రంగురంగుల పూలా బొకేలు కలకల్లాడుతున్నాయి.. బొకేలు కొనుగోలు దారులతో కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్లో సందడి నెలకొంది.

Show comments