వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోనున్నారు. సాయంత్రం 5 గంటల లోపు సరెండర్ కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చూసింది. ఐదు రోజుల గడువు ముగియడంతో ఈ సాయంత్రం జైల్లో సరెండర్ అవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు మిథున్‌రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ నుంచి వాహనంలో జైలుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా మిథున్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఇక రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మిథున్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
ఇది కూడా చదవండి: Ritika Naik : ఆమె నా స్ఫూర్తి.. మంచి యాక్షన్ కథల్లో నటించాలని ఉంది
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు తెలిపింది. అయితే సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసుందుకు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్‌రెడ్డి పిటిషన్ వేయగా విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో గురువారం జైల్లో సరెండర్ కానున్నారు.
